: జ‌య‌ల‌లిత మృతిపై రాజ్య‌స‌భ‌లో దుమారం


త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై రాజ్య‌స‌భ‌లో ఈ రోజు దుమారం చెల‌రేగింది. ఆమె మృతిపై విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని పన్నీర్ సెల్వం వ‌ర్గ ఎంపీలు ప్ల‌కార్డులు ప్ర‌దర్శిస్తూ ఛైర్మ‌న్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లారు. జ‌య‌ల‌లిత మృతిపై ఎన్నో అనుమానాలున్నప్ప‌టికీ విచార‌ణ‌కు ఆదేశించక‌పోవ‌డం ఏంటంటూ వారు నినాదాలు చేశారు. వారికి న‌చ్చ‌జెప్పేందుకు డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ ఎంత‌గా ప్ర‌య‌త్నించినా వినిపించుకోలేదు. దీంతో కురియ‌న్ వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి, చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. అనంత‌రం రాజ్య‌స‌భ ఈ రోజు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వాయిదా ప‌డింది.  

  • Loading...

More Telugu News