: ‘సచిన్’ సినిమాకు ఆస్ట్రేలియా నటుడి ప్రచారం.. థ్యాంక్స్ చెప్పిన టెండూల్కర్
క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమా ఈ ఏడాది మేలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ అభిమానులు ఆస్ట్రేలియాలో ఆ సినిమా ప్రచారంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా నటుడు మనూ సింగ్ న్ ‘సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. సచిన్ చిత్రానికి ప్రచారం నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో స్వయంగా సచినే నటిస్తుండడం విశేషం. ఆస్ట్రేలియాలో తన సినిమా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న సచిన్ ట్విట్టర్ లో స్పందిస్తూ తనపై ఇంత అభిమానం చూపుతున్న అందరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు.
Overwhelmed! Thank you for the support and love :) https://t.co/olelVGsRJp
— sachin tendulkar (@sachin_rt) 9 March 2017