: నిరసనలతో అట్టుడుకుతున్న దక్షిణ కొరియా
దక్షిణ కొరియా నిరసనలతో అట్టుడుకుతోంది. దేశాధ్యక్షురాలు పార్క్ గెన్ హేను ఆఫీసు నుంచి తొలగిస్తున్నట్టు ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, ఆమె అభిమానులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పలుచోట్ల పోలీసులకు, పార్క్ గెన్ హే అభిమానులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె అభిమానులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. శాంసంగ్ సంస్థ హెడ్ తో కలిసి భారీ అవినీతికి పార్క్ గెన్ పాల్పడినట్టు కోర్టులో నిరూపితమైంది. దీంతో, ఆమెను ఆఫీస్ నుంచి తొలగిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.