: చాక్లెట్ల కోసం కాదు.. బీరు కోసం కిందపడి ఏడుస్తోన్న చిన్నారి.. వీడియో హల్‌చల్!
చిన్నారులు సాధారణంగా చాక్లెట్లు, బిస్కెట్లు కావాలని ఏడుస్తారు. కానీ ఓ పాప మాత్రం బీరు కావాలని ఏడుస్తోంది. ఇవ్వకపోతే కిందపడి ఏడుస్తోంది. యూ ట్యూబ్‌లో ఒకరు ఉంచిన ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. నిండా రెండేళ్లు కూడా నిండని ఆ పాపకు తన తండ్రి ఏం ఇచ్చినా తీసుకోవడం లేదు. తన నోటి దగ్గర బీరు సీసా పెడితే మాత్రం తాగేస్తోంది. బాటిల్ లోని బీరుని పాలలా తాగేస్తోంది. ఈ పాపకు అంటుకున్న ఈ అలవాటు పట్ల నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ చిన్నారికి బీరును అలవాటు చేసిన తండ్రికి చీవాట్లు పెడుతున్నారు.