: రీపోలింగ్.. తీవ్ర ఆందోళనలో ఎమ్మెల్సీ అభ్యర్థులు!


తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో ఫోటోలు తారుమారు కావడంతో, నిన్న జరిగిన పోలింగ్ ను ఈసీ రద్దు చేసింది. 19వ తేదీన రీపోలింగ్ కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలనే విషయంలో నిబంధన లేకపోవడంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. ప్రచారం సందర్భంగా టీచర్లకు కార్లను ఏర్పాటు చేయడం, భోజనాలు, బ్యానర్లు, కరపత్రాల ప్రింటింగ్ కోసం భారీగా ఖర్చయింది. అంతేకాదు, హోటళ్లను అద్దెకు తీసుకుని భారీగా విందులు ఏర్పాటు చేశారట. కొందరికి విలువైన గిఫ్టులను ఇచ్చారట. కొన్ని ప్రాంతాల్లోని ఓటర్లకు ఒక్కొక్కరికి రూ. 2వేల నుంచి రూ. 4వేల వరకు పంచారట. ఈ రకంగా ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ ఖర్చు తడిసి మోపెడయిందట.

నిన్న పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేసిన వారంతా 19న మళ్లీ వచ్చి ఓటు వేస్తారా? అనే భయం ఇప్పుడు అభ్యర్థుల్లో నెలకొంది. రీపోలింగ్ కు ఎంతో సమయం లేకపోవడంతో... మళ్లీ అందరిని కలసి పలకరించాల్సి ఉంటుంది. మళ్లీ ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో, తప్పు ఈసీ చేస్తే, శిక్ష మాత్రం తమకు పడిందని అభ్యర్థులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News