: ఇదో రకం నిరసన... ఏటీఎం నుంచి డబ్బులు రాలేదని కిళ్లీ నమిలి మరీ ఉమ్ము వేశారు!
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోని ఎన్నో ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్న విషయం తెలిసిందే. అసలే డబ్బులు అందక అసహనంతో ఉన్న ఖాతాదారులపై బ్యాంకులు ట్యాక్స్ బాదుడు మొదలుపెట్టడంతో వారు మరింక కోపానికి గురవుతున్నారు. అయితే, నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో డబ్బు కోసం ఏటీఎంల వద్దకు వస్తోన్న ఖాతాదారులు తీవ్ర అసంతృప్తికి లోనయి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని ఎస్‌బీహెచ్, ఆంధ్రాబ్యాంకు ఏటీఎం కేంద్రాల్లో డబ్బు తీసుకునేందుకు వచ్చిన ప్రజలు అందులో ఇంకా డబ్బు పెట్టకపోవడం చూసి 10 రోజులుగా డబ్బు ఉండడం లేదని కిళ్లీలు నమిలి ఉమ్ము వేసి వెళ్లిపోయారు. అయినప్పటికీ బ్యాంకు సిబ్బంది తీరు మారలేదు. ఏటీఎంలలో డబ్బు పెట్టాల్సింది పోయి వాటికి పూర్తిగా తాళం వేసేశారు.