: కాంగ్రెస్ ఎమ్మెల్యేలవి చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలే: ఎద్దేవా చేసిన హరీశ్ రావు


గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ, బయటకు వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించిన తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్ రావు, తాము ఎన్ని రోజులైనా, ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని చెబుతున్నా విపక్షాలు వినిపించుకోలేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఈ చిలిపి చేష్టలను ఏ ఉద్దేశంతో చేశారని ఆయన ప్రశ్నించారు. సభకు అంతరాయం కలిగించేందుకు గిల్లికజ్జాలు పెట్టుకోవాలన్నదే వారి ఉద్దేశమని ఎద్దేవా చేశారు. ప్రసంగంపై విమర్శలు ఉంటే ధన్యవాద తీర్మానంపై చర్చించేటప్పుడు చెప్పచ్చుకదా? అని హితవు పలికారు.

గతంలో సభ జరిగినప్పుడు విపక్షాలు విఫలం అయ్యాయని, ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతం కానుందని ఆయన అన్నారు. ప్రతి పక్షాల వైఖరిని తాము తీవ్రంగా తప్పుపడుతుతున్నామని చెప్పిన హరీశ్ రావు, బడుగుల కోసం తమ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉందని, వాటిని తలచుకుని కాంగ్రెస్, టీడీపీలు వణికిపోతున్నాయని విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News