: తుగ్లక్ పనులు చేసి గొప్పగా చెప్పుకుంటున్నారు: కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ అన్నీ తుగ్లక్ పనులు చేసి, వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాసిచ్చిన పాఠాన్నే గవర్నర్ చదివారని విమర్శించారు. గవర్నర్ చేత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెప్పించిందని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంలో ఒక్క ప్రధాన అంశం కూడా లేదని అన్నారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ హయాంలో పూర్తయినవి తప్ప వీరి హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులతో అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు.

కొత్తగా పరిశ్రమలు వచ్చినట్టు, పెట్టుబడులు భారీగా వచ్చినట్టు గవర్నర్ చేత చెప్పించారని... వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తక్కువగా వచ్చాయని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్ సైట్ ఇచ్చిన నివేదికలో ఉందని ఉత్తమ్ అన్నారు. జిల్లాల విభజనలో కూడా ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ముస్లింలు, గిరిజనులు ఎదురు చూస్తున్న 12 శాతం రిజర్వేషన్ల గురించి స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News