: నా పెళ్లికి ఇంకా చాలా టైం ఉందిలే : యంగ్ హీరో రాజ్ తరుణ్
హిట్ల మీద హిట్లు కొడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతుండడంతో అదే ఊపుమీద నెక్ట్స్ సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన వద్దకు ప్రస్తుతం అన్నీ ప్రేమకథలే వస్తున్నాయని, తన వయసు అలాంటిదని చెప్పాడు. ఇటువంటి కథల సినిమాలు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తానని అన్నాడు. ఇక తన పెళ్లి గురించి స్పందిస్తూ.. దానికి ఇంకా చాలా టైం ఉందిలే అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని చెప్పాడు. ఇక తాను ఎవర్నైనా ప్రేమిస్తే మీడియాకు వెంటనే తెలిసిపోతుందని చెప్పాడు.