: రైల్వే స్టేష‌న్‌లోకి గొడ్డ‌లితో ప్రవేశించి భయానక వాతావరణం నెలకొల్పిన వ్యక్తి


జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌ నగరంలోని ఓ రైల్వే స్టేషన్‌లోకి ప్ర‌వేశించిన ఓ వ్య‌క్తి అక్క‌డి ప్ర‌యాణికుల‌పై విచక్షణా రహితంగా విరుచుకుప‌డ్డాడు. చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకుని క‌నిపించిన వారిపై దాడి చేశాడు. దీంతో ఏడుగురు ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. జాతి వివ‌క్షతో అమెరికాతో పాటు ప‌లు దేశాల్లో దాడులు జ‌రుగుతున్న వేళ ఆ రైల్వే స్టేష‌న్‌లోనూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. గతంలో కూడా ఈ రైల్వే స్టేష‌న్‌లో ఇలాంటి దాడులు జరిగాయని అక్క‌డి పోలీసులు తెలిపారు.

యుగోస్లావియాకు చెందిన ఓ వ్యక్తి (36) మానసికంగా బాధపడుతున్నాడని, దాంతో అతను రైల్వేస్టేషన్‌లోకి దూసుకువ‌చ్చి గొడ్డలితో తీవ్రంగా దాడి చేశాడని చెప్పారు. పోలీసులను చూసి అతడు పారిపోయేందుకు ఓ పెద్ద గోడ దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అత‌డిని అరెస్టు చేసిన‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. అత‌డు గొడ్డ‌లితో విరుచుకుప‌డ‌డంతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ స్టేష‌న్‌లో రక్త‌పు మ‌డుగులు క‌న‌ప‌డ్డాయి.

  • Loading...

More Telugu News