: టాలీవుడ్ హీరో 'ఆనంద్' రాజా స్థలం కబ్జా!


టాలీవుడ్ హీరో 'ఆనంద్' రాజా కుటుంబానికి చెందిన స్థలం కబ్జాకు గురైంది. హైదరాబాదులోని బోయిన్ పల్లిలో ఉన్న సమతానగర్ లో రాజా కుటుంబీకులు 1996లో కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో ఓ చిన్న గది, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి వదిలేశారు. అయితే, ఈ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన బల్వంతరెడ్డి, మాధవిలు... ఆ స్థలంలో రెండు రోజుల క్రితం నుంచి బోర్ వేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజా కుటుంబీకులు బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News