: ఆ శుభవార్త ఈ నెలలోనే.. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై సుజనా


ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెలలోనే ఆ శుభవార్త వింటారని కేంద్రమంత్రి, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన పత్రాలను కేంద్ర హోంశాఖ సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే నియోజక వర్గాల పెంపు బిల్లుకు ఆమోదం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన టీడీపీపీ భేటీ అనంతరం సుజనా విలేకరులతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ అనుమతి అవసరం లేదని, నోటిఫికేషన్ ద్వారా కూడా చట్టబద్ధత వస్తుందని కేంద్రం చెబుతోందని, అయితే కేబినెట్ అనుమతికి అవసరమైన ఫైలు ఇప్పటికే సిద్ధమైందని మంత్రి తెలిపారు. అలాగే కేంద్రం నుంచి ఈ మూడేళ్లలో ఏపీకి వచ్చిందేమిటి? పెండింగ్‌లో ఉన్నవి ఏమిటి? అనే అంశాలపై భేటీలో సమీక్షించినట్టు సుజనా తెలిపారు.

  • Loading...

More Telugu News