: ప్రేమ పెళ్లితో తమ పరువు తీశాడంటూ అబ్బాయిపై ఫిర్యాదు.. రూ. 17 లక్షల జరిమానా విధించిన పాక్ పంచాయతీ!


ప్రాణప్రదంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఇప్పుడు లక్షలాది రూపాయలను జరిమానాగా చెల్లించాల్సి వస్తోంది. పాకిస్థాన్‌ దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని కంధ్‌కోట్ కషోమరే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన యువతీయువకులు గత కొంతకాలంగా  ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ప్రియుడు.. ప్రియురాలి ఇష్టంతో చట్టబద్ధంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే తమ కుమార్తెను పెళ్లి చేసుకుని తమ పరువు తీశాడని, జరిమానా చెల్లించాలని ఆదేశించాలంటూ యువతి తల్లిదండ్రులు జిర్గా(స్థానిక పంచాయతీ)లో ఫిర్యాదు చేశారు. దీనిని విచారించిన జిర్గా యువకుడికి రూ.17 లక్షల జరిమానా విధించడంతోపాటు మూడు నెలల పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తూ తీర్పు చెప్పింది. జిర్గా తీర్పులను ఇటీవలే పాక్ ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తాజా తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News