: ఎల్లయ్య విడుదల.. ముగిసిన చీరల చోరీ కేసు!
చీరల దొంగతనం కేసులో అరెస్టయి 11 నెలలుగా తెలంగాణ జైలులో ఉంటున్న ఎల్లయ్యకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయనను బుధవారమే విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ఉదయకుమార్ సాగర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్ను ముగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. తన భర్తను అన్యాయంగా 11 నెలలపాటు జైలులో పెట్టారంటూ ఎల్లయ్య భార్య వేసిన పిటిషన్ను గురువారం చీఫ్ జస్టిస్ జస్టిస్ జగదీశ్సింగ్ ఖేహెర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషనల్ కౌల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే ఎల్లయ్య భార్య విజ్ఞప్తి మేరకు రాష్ట్రప్రభుత్వం అతడిని బుధవారమే విడుదల చేసిందని ఉదయకుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కేసును ఇక్కడితో ముగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.