: అణు యుద్ధాలు తప్పేలా కనిపించడం లేదు.. స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిక
సాంకేతిక రంగంలో మానవుడు అవలంబిస్తున్న చర్యల వల్ల భవిష్యత్తులో అణు, బయోలాజికల్ యుద్ధాలు తప్పేలా కనిపించడం లేదని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయపడ్డారు. భూతాపం క్రమంగా పెరుగుతుండడం, భూమిపైన అనేక జాతులు అంతరించిపోవడం, ఆర్టిఫిషియల్ మేధస్సు ప్రపంచాన్ని వణికించడం.. వంటి భయాలు ఓపక్క ఉన్నప్పటికీ మానవ మనుగడకు వచ్చిన ముప్పేమీ ఉండదని కూడా ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో తలెత్తబోయే అణు, బయోలాజికల్ యుద్ధాల ముప్పును ‘వరల్డ్ గవర్నమెంట్’ మాత్రమే తప్పించగలదని, దానిని ఏర్పరచుకుంటే ఆ ముప్పును ముందుగానే గుర్తించే వీలుంటుందని హాకింగ్ సూచించారు.