: భోపాల్ జైలుకెళ్లనున్న రణ్ బీర్ కపూర్!


ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ భోపాల్ జైలుకెళ్లనున్నాడు. రణ్ బీర్ కపూర్ జైలు కెందుకు వెళ్లనున్నాడన్న అనుమానం వచ్చిందా? రణ్ బీర్ కపూర్ ఏ కేసులోనూ ఇరుక్కోలేదులెండి. సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాలో ప్రధాన పాత్రను రణ్ బీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాయుధాల కేసులో సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవించిన విషయం మనకు తెలుసు.

ఈ నేపధ్యంలో సినిమాలో రానున్న జైలు సన్నివేశాల చిత్రీకరణ కోసం రణ్ బీర్ కపూర్ భోపాల్ జైలుకు వెళ్లనున్నాడు. ఈ జైలులో వారం రోజుల పాటు గడపనున్నాడు. కాగా, ఈ సినిమాను బాలీవుడ్ హిట్ సినిమాల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ రూపొందిస్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీపై నమ్మకంతో సంజయ్ దత్ తన ఆటోబయోగ్రపీ నిర్మాణానికి అంగీకరించాడు. కాగా, రాజ్ కుమార్ హీరానీతో సంజయ్ దత్ కు మంచి అనుబంధం ఉంది. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'మున్నాభాయ్ సీక్వెల్', 'పీకే' వంటి సూపర్ హిట్ సినిమాలను సంజయ్ దత్ కు రాజ్ కుమార్ హిరానీ అందించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News