: ‘జబర్దస్త్’ లో వల్గారిటీ ఉంటుందనే మాట వాస్తవమే!: షేకింగ్ శేషు
‘జబర్దస్త్’ షోలో బూతులు, వల్గారిటీ ఉంటోందని, ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నామనే మాట వాస్తవం అయి ఉండొచ్చని ‘జబర్దస్త్’ నటుడు షేకింగ్ శేషు అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘ '‘జబర్దస్త్’ ఫస్ట్ ఎపిసోడ్ లోనే బీభత్సమైన వల్గారిటీ ఉంది. ఈ ఎపిసోడ్ ని చూసిన మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఆనందించారు. దీంతో, టీఆర్ పీ 15..16 కు వెళ్లిపోయింది. ఆ ఒరవడి నుంచి వీళ్లు వెనక్కి రాలేకపోతున్నారు. వల్గారిటీ విషయమై బయట నుంచి ఒత్తిడి రావడంతో .. చివరకు మల్లెమాల సంస్థ వారు కంట్రోల్ చేశారు. దీంతో, టీఆర్ పీ 8..9 కి పడిపోయింది. ఎందువల్లా అంటే, ‘బూతు’ లేకపోవడం వల్ల. సొసైటీలో చెడు ఎక్కడ ఉందో అక్కడికి ముందుగా, మంచి ఎక్కడ ఉందో అక్కడికి లేటుగా వెళతారు. ప్రోగ్రాం బాగుండక పోవడమనేది ఛానెల్ వాళ్ల తప్పు కాదు .. ప్రేక్షకుల తప్పు...’' అంటూ షేకింగ్ శేషు చెప్పుకొచ్చాడు.