: కాన్పూర్ లో పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి


ఉజ్జయిని రైలు ప్రమాద ఘటనకు కారకులైన ఉగ్రవాది సైపుల్లాను ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఏటీఎస్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. సెల్ఫ్ ర్యాడికలైజ్డ్ (స్వయం ప్రేరేపిత) ఉగ్రవాదులు అజహర్, గౌస్ మహ్మద్ ఖాన్‌ లను కాన్పూరులో అరెస్టు చేసినట్లు యూపీ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) దల్జీత్ సింగ్ చౌదరి పేర్కొన్నారు. వీరిలో ఒకరు భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి అని ఆయన వెల్లడించారు. లక్నోలో జరిగిన ఆపరేషన్‌ లో మరణించిన సైఫుల్లా, అతని ఐదుగురు సహచరులు స్వయం ప్రేరేపిత ఉగ్రవాదులని, వీరంతా ఇస్లామిక్ స్టేట్ ఖొరసానా మాడ్యూల్‌ ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచించినట్లు ఆయన పేర్కొన్నారు. దానితో పాటు పెద్దఎత్తున విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News