: చంద్రబాబుకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు: ఎంపీ రాయపాటి


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన జీవితంలో చంద్రబాబు అంతటి సమర్థుడు అయిన నేతను చూడలేదని ప్రశంసించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై ఆయన విమర్శలు చేశారు.

వంద జన్మలు ఎత్తినా చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ కు రాదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతుంటే, జగన్ మాత్రం సంపాదన కోసమే పని చేస్తున్నారని రాయపాటి విమర్శించారు. కాగా, తెలుగుదేశం పార్టీలోని కమ్మ నేతలు చంద్రబాబును ప్రశ్నించే స్థితిలో లేరని, గ్రామ స్థాయిలో టీడీపీ క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉందని, చంద్రబాబును తాను గట్టిగా ప్రశ్నించలేకపోతున్నానని రాయపాటి సాంబశివరావు ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తాజాగా, చంద్రబాబును ప్రశంసిస్తూ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News