: బాలీవుడ్ జర్నలిస్టును 'ఆ తర్వాతి ప్రశ్న మీరు అడగొద్దు’ అన్న రాజమౌళి!


ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రం ఎంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ సీక్వెల్ ‘బాహుబలి: ద కన్ క్లూజన్’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత, జర్నలిస్టు అనుపమ చోప్రా ‘బాహుబలి’ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ సినిమా సెట్ లోనే జరిగిన ఈ ఇంటర్వ్యూ విశేషాల వీడియోను ‘బాహుబలి’ చిత్ర బృందం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

‘ఇదేం సెట్?’ అని అనుపమ చోప్రా ప్రశ్నించగా, ‘బాహుబలిని కట్టప్ప చంపింది ఇక్కడే’ అని దర్శకుడు రాజమౌళి సమాధానమిచ్చారు. అయితే, ఆ తర్వాతి ప్రశ్నకు ఆ జర్నలిస్టు సిద్ధమవుతున్న తరుణంలో.. ‘మీ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ తర్వాతి ప్రశ్న మీరు అడగొద్దు’ అని రాజమౌళి అనడంతో అక్కడ ఉన్న వారు నవ్వులు చిందించారు. అయితే, ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు?’ అనే ప్రశ్న ఆమె అడగబోతున్నట్లు రాజమౌళి ముందుగానే ఊహించి పై విధంగా అన్నారు.

 

  • Loading...

More Telugu News