: గోవా అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు


గోవాలో అధికార బీజేపీకి షాక్ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. ఇంతవరకు గోవాలో అధికారంలో ఉన్న బీజేపీకి షాకిస్తూ ఓటర్లు తీర్పు చెప్పనున్నారని సర్వే ఫలితాలు తెలిపాయి. బీజేపీకి 12 నుంచి 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 21 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 7 నుంచి 9 స్థానాల్లో విజయం లభించనుందని తెలిపాయి. దీంతో గోవాలో స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వల్ప తేడాతో స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 

  • Loading...

More Telugu News