: పంజాబ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు


పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి పంజాబ్ లో పాగా వేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 71 స్థానాలు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. అధికారంలో ఉన్న అకాలీ దల్-బీజేపీ కూటమి కేవలం 7 స్థానాలకే పరిమితమవుతుందని నివేదికలు స్పష్టం చేశాయి. పంజాబ్ లో 51 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా ప్రతిపక్ష పాత్రను ఆమ్ ఆద్మీ పార్టీ పోషించనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోనుందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News