: యూపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం అవాస్తవమని ఉత్తరప్రదేశ్ ఓటర్లు తేల్చిచెప్పినట్టు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సత్తా చాటనుందని, ప్రత్యర్థి సమాజ్ వాదీ-కాంగ్రెస్ పార్టీల కూటమిని ఓడిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీ 170 నుంచి 185 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీటీవీ, న్యూస్ ఎక్స్, టైమ్స్ నౌ సంస్థలు చెబుతున్నాయి.
సమాజ్ వాదీ-కాంగ్రెస్ పార్టీల కూటమి 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బహుజన్ సమాజ్ పార్టీ 90 నుంచి 100 స్థానాల్లో విజయం సాధించవచ్చని ప్రకటించాయి. దీంతో దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించడం ద్వారా పార్లమెంటులో పూర్తి స్థాయి నిర్ణయాధికారాన్ని బీజేపీ చేజిక్కించుకోనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అఖిలేష్-రాహుల్ ఒక్కటైనా మోదీ ముందు బలాదూరయ్యారని తేలిందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు చెబుతున్నాయి.