: ఎమ్మెల్యేలకు సర్వే రిపోర్టులు చేతిలో పెట్టి.. క్లాసు పీకిన కేసీఆర్


టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సర్వే చేయించారు. ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ హితబోధ చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. కొంత మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగితే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని, పది రోజుల్లో నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. 

  • Loading...

More Telugu News