: వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన కేసీఆర్!


2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 101 నుంచి 106 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, జిల్లాల వారీగా తన సర్వే వివరాలను వెల్లడించారు.

ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని ఈ సందర్భంగా కేసఆర్ ఆదేశించారు. అంతేకాదు, ప్రతి అంశంపై అవగాహనతో రావాలని చెప్పారు. మంత్రులంతా అరగంట ముందే అసెంబ్లీకి చేరుకోవాలని తెలిపారు.

  • Loading...

More Telugu News