: వావ్ గ్రేట్...టీ రంగు చూస్తే చాలు...ఆమె దాని చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించిన విద్యకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఆహారపదార్థాలను ఆస్వాదించడం ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఆమె అస్సాం వెళ్లి మరీ నాలుగు నెలల కోర్సు పూర్తి చేశారు. అనంతరం పరీక్షలు రాసిన ఆమె టీ సొమిలియర్ గా సర్టిఫికేట్ సంపాదించారు. టీ సొమిలియర్ అంటే టీని చూడగానే...అది ఏ టీ పొడితో, ఎంత ఉష్ణోగ్రత వద్ద తయారు చేశారు? వంటి వివరాలన్నీ చెప్పగలగడం. రెండు తెలుగు రాష్ట్రాల్లోకీ ఒక్క విద్య మాత్రమే టీ సొమిలియర్ అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆమె టీ రంగును చూసి దానిలో ఎంత టీపొడి వుంది? ఏ టీపొడి వాడారు? ఎంత సేపు, ఎన్ని డిగ్రీల వద్ద మరిగించారు? వంటి 300 రకాల టీల గురించి చెప్పగలరు. ప్రపంచంలో 3000 రకాల టీలు వినియోగంలో ఉన్నాయని ఆమె చెబుతున్నారు. భారత్ లో మాత్రం అస్సాం టీ, నీలగిరి టీని మించిన టీలు లేవని ఆమె తెలిపారు.