: పవన్ కల్యాణ్ 'ఖుషీ'లో ఆ సూపర్ హిట్ పాటను ఎడిట్ చేసింది నేనే: మాజీ భార్య రేణూ దేశాయ్


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్‌ తన గతాన్ని మరోసారి గుర్తు చేసుకుంది. భర్తగా పవన్ కల్యాణ్ కు సాధారణ మార్కులిచ్చిన రేణూ దేశాయ్, పవన్ తనను బాగా ప్రోత్సహించేవాడని తెలిపింది. కఠిన పరిస్థితుల్లో కూడా తనను పని చేయమని ప్రోత్సహించేవాడని చెప్పింది. అందుకే తాను గతంలో పవన్ కల్యాణ్ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఎడిటర్‌ గా విధులు నిర్వర్తించానని తెలిపింది. ఈ విషయం చాలామందికి తెలియదని పేర్కొన్న రేణూ దేశాయ్, ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా పవన్‌ నటించిన సినిమాలకు పనిచేశానని తెలిపింది.

 అలా పని చేసిన సినిమాల్లో 'ఖుషి', 'బాలు' సినిమాలు ఉన్నాయని చెప్పింది. 'జానీ' సినిమాలో ఆమె పని చేసినట్టు టైటిల్స్ లో ప్రకటించారు. అయితే 'ఖుషి', 'బాలు' సినిమాల టైటిల్స్ లో ఆమె పేరు వేయలేదు. కానీ ‘ఖుషి’ సినిమాలోని ‘ఏ మేరా జహ’ పాటను తానే ఎడిటింగ్‌ చేశానని రేణూ దేశాయ్ వెల్లడించింది. ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా కూడా పని చేశానని తెలిపింది. అలాగే అకీరా పది రోజుల పసికందుగా ఉన్నప్పుడు కూడా ‘బాలు’ సినిమా కోసం పనిచేశానని తెలిపింది. అలా పని చేయడానికి కారణం పవన్ ప్రోత్సాహమేనని చెప్పింది. పవన్ తనను శక్తిమంతమైన మహిళగా పరిగణించడమేనని రేణూ దేశాయ్ తెలిపింది. 

  • Loading...

More Telugu News