: హెచ్1బీ వర్క్ వీసా, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్‌లో మరిన్ని మార్పులు
హెచ్1బీ వర్క్ వీసా, ఈబీ1, ఈబీ2 వంటి గ్రీన్‌కార్డులతో అత్యుత్తమ మేథోసంపత్తిని అమెరికాకు తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు ఆర్కాన్సాస్‌కు చెందిన సెనేటర్ టామ్ కాటన్ పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అనంతరం సెనేటర్ పలు విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వీసా విధానాలతో ఎక్కువ మంది ప్రతిభావంతులు అమెరికాకు రావడం లేదని.. వారిని ఆకర్షించే విధంగా వీసాల విధానాన్ని సవరించాలని ట్రంప్ సూచించినట్లు తెలిపారు.
హెచ్1బీ వర్క్ వీసా, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ కేటగిరి విధానాల్లో మరిన్ని మార్పులు తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుత విధానాలతో ప్రతిభావంతులైన పీహెచ్‌డీలు, కంప్యూటర్ సైంటిస్ట్‌ల స్థానంలో మధ్యరకం వారిని భర్తీ చేస్తుండటం ద్వారా అర్హులైన అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిపారు. అసలు అమెరికన్లు చేయని ఉద్యోగం లేదు.. వారికి జీతం పొందే హక్కు ఉంది.. వారు భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలు చేస్తారు’ అని కాటన్ తెలిపారు. ప్రస్తుతం కొత్త విధానంలో 15 మంది ఇమ్మిగ్రెంట్లలో కేవలం ఒకరిని మాత్రమే అమెరికాలోకి రానిస్తామన్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ తనతో చెప్పారని కాటన్ తెలిపారు.