: కొందరికి నాపై అనుమానం, అసహ్యం... అయినా నేనింతే!: కోహ్లీ


తనపై, తన ఆటతీరుపై కొందరికి అనుమానాలు ఉన్నాయన్న సంగతి తనకు తెలుసునని, ఇంకొందరు తన ప్రవర్తనను అసహ్యించుకోవచ్చని, అయినప్పటికీ తాను దేన్నీ పట్టించుకోబోనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. బీసీసీఐ నుంచి పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న కోహ్లీ ఆ తర్వాత మాట్లాడాడు. భారత జట్టు నిలకడగా ముందుకు సాగుతోందని, తన ప్రదర్శనపై తనకు నమ్మకం ఉందని చెప్పాడు. తానెన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడటం లేదని, ఏ ఫార్మాట్ అయినా, అన్వయించుకుని ఆడటమే తనకు ముఖ్యమని అన్నాడు. ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడిగా, నిత్యమూ టాప్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటానని, జట్టు గెలుపు కోసమే కృషి చేస్తుంటానని వివరించాడు.

  • Loading...

More Telugu News