: 'ఉమెన్స్ డే'పై వర్మ మరో వివాదాస్పద వ్యాఖ్య!


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. మహిళలంతా సన్నీలియోన్ లా మగాళ్లకు సంతోషాన్ని అందించాలంటూ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగక ముందే వర్మ మరో ట్వీట్ చేశాడు. 'ఉమెన్స్ డే' లాగ 'ఉమెన్స్ నైట్' కూడా ఏదైనా ఉందా? అంటూ మరో ట్వీట్ వదిలాడు. ఈ ట్వీట్ మరింత వివాదాన్ని రాజేస్తోంది.

మరోవైపు, మహిళలను కించపరిచేలా వర్మ ట్వీట్లు ఉన్నాయంటూ గోవాకు చెందిన సామాజిక కార్యకర్త విశాఖ మాంబ్రే వర్మపై కేసు పెట్టారు. ఈ ఫిర్యాదుపై కూడా వర్మ అదే స్థాయిలో స్పందించాడు. సోషల్ మీడియాలో సన్నీలియోన్ ను ఫాలో అవుతున్న 18 లక్షల మందిని అవమానించినందుకు 212 మంది సామాజిక కార్యకర్తలపై కౌంటర్ కేసు పెడతానంటూ ట్వీట్ చేశాడు. 

  • Loading...

More Telugu News