: మళ్లీ ట్వీటేసిన సెహ్వాగ్... ఈసారి టార్గెట్ రాస్ టేలర్!


తనదైన స్టయిల్ లో ట్వీట్ మీద ట్వీట్ వేస్తూ, క్రీడాభిమానులతో పాటు సోషల్ మీడియా జనాలను అలరించే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో ట్వీట్ వేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ వ్యంగ్య ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. షర్ట్ లేకుండా ఓ చినిగిపోయిన ప్యాంటు, షర్ట్ తో ఉన్న వ్యక్తి ఫోటోతో పాటు, చినిగిన బనియన్ల ఫోటోలు పెడుతూ, "హ్యాపీ బర్త్ డే రాస్ టేలర్. టైలర్ జీ... నువ్వు న్యూజిలాండ్ కోసం కొన్ని ఉత్తమ భాగస్వామ్యాలను కుట్టావు. ఇక వీరికి నీ సాయం కావాలి" అని అన్నాడు. చినిగిన బట్టలకు టేలర్ కుట్లు అవసరమన్న విధంగా ఉన్న ఈ ట్వీట్ తెగ షేర్ అవుతోంది.

  • Loading...

More Telugu News