: ఆడియో సీడీ వేసుకునేన్ని డైలాగులుంటాయి: బాలకృష్ణతో సినిమాపై పూరి
బాలకృష్ణ కొత్త సినిమాలోని ఏదైనా ఓ డైలాగు చెప్పాలని ఈ ఉదయం ఆయన 101వ చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అభిమానులు కేకలు పెడుతున్న వేళ, దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. "ఒక డైలాగు కాదు... ఆడియో సీడీ వేసుకునేన్ని డైలాగులు ఉంటాయి" అని అభిమానుల ఆనందోత్సాహాన్ని మరింతగా పెంచాడు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని చెప్పాడు. అభిమానులు ఊహించే దానికన్నా ఎక్కువ సంతృప్తిని ఇచ్చేలా చిత్రాన్ని తయారు చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ సినిమా తొలి షాట్ ను బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలపై చిత్రీకరించినట్టు తెలిపాడు.