: ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదుచూస్తున్నా: పూరీ జగన్నాధ్


తాను నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా తీయాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశానని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని దర్శకుడు పూరీ జగన్నాధ్ వ్యాఖ్యానించాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణను ఎన్నటికీ మరచి పోలేనని అన్నాడు. ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని తనకుందని చెప్పాడు. "నేను మీ అభిమానులందరికీ మాటిస్తున్నాను. మీకు ఏం కావాలంటే, ఎలా కావాలంటే... ఆ రేంజ్ లో వుంటుంది. సో... ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్ గానీ... జై బాలయ్య. సినిమా వెంటనే ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 29న రిలీజ్... కావాలంటే ఒకరోజు ముందే అయినా రిలీజ్ కు రెడీ. థ్యాంక్యూ, థ్యాంక్యూ సోమచ్" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News