: బాలయ్య 'బాలీవుడ్' స్టయిల్... షూటింగ్ ప్రారంభం కాకుండానే 101వ చిత్రం రిలీజ్ డేట్!
ఈ ఉదయం హైదరాబాద్, కూకట్ పల్లిలో ప్రారంభమైన బాలకృష్ణ 101వ చిత్రం రెగ్యులర్ షూటింగును ఈనెల 16 నుంచి మొదలు పెట్టి ఏకధాటిగా షూటింగ్ ను కొనసాగిస్తామని నిర్మాత ఆనంద ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు. ఈ విషయంలో చాలా మంది మంచి కామెంట్లు చేశారని, బాలీవుడ్ చరిత్రను తెలుగు ఇండస్ట్రీకి తెస్తున్నారని, పూజకాకముందే రిలీజ్ డేటును చెప్పడం మంచి పద్ధతని చెబుతున్నారని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు సహకరిస్తున్నారని, షెడ్యూల్స్ చక్కగా సాగేందుకు ఇప్పటికే ప్రణాళికలు జరిగిపోయాయని వెల్లడించారు. ముందే రిలీజ్ తేదీని ప్రకటించడం వల్ల పెద్ద హీరోల చిత్రాల మధ్య పోటీ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.