: మూడొంతుల నిర్మాణం పూర్తయిన భారీ వంతెన.. శరవేగంగా నిర్మిస్తున్న కువైట్
మారుమూల ప్రాంతమైన సుబియాలో సిల్క్ సిటీ ఏర్పాటే లక్ష్యంగా కువైట్ చేపట్టిన 35.40 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మధ్య ఆసియా, యూరప్‌తో గల్ఫ్‌ను అనుసంధానించే పురాతన సిల్క్ రోడ్‌కు కొత్త శక్తిని ఇచ్చే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే మూడొంతులు పూర్తయింది. మరికొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సుబియా వెళ్లేందుకు 90 నిమిషాలు పడుతుండగా వంతెన అందుబాటులోకి వస్తే కేవలం 20 నిమిషాల్లోనే సుబియా చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం వంద బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టారు. సుబియాలో 5 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. 2006లో మృతి చెందిన షేక్ జబీర్ అల్ షబా కాజ్వేగా ఈ బ్రిడ్జికి నామకరణం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో వంతెనగా ఖ్యాతికెక్కుతున్న ఈ బ్రిడ్జ్‌కు 1500 పిల్లర్లు ఉన్నాయి.