: విజయనగరం జిల్లాలో ఏటీఎం నుంచి వచ్చిన 'బొమ్మ' నోటు!
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ ఏటీఎం నుంచి అచ్చు ఒరిజినల్ నోట్లలా కనిపిస్తున్న పిల్లలాడుకునే బొమ్మ కరెన్సీ బయటకు రావడం కలకలం రేపింది. మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫుల్ ఆఫ్ ఫన్ పేరుతో ఉన్న రూ.500 తమాషా నోటు బయటకు వచ్చింది. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ, లైన్ మన్ విధులు నిర్వర్తించే అంపావల్లి చిన్నారావు, కరూర్ వైశ్య బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోగా, ఈ రూ. 500 నోటు వచ్చింది. నోటుపై నంబర్ గా అన్నీ సున్నాలే ఉన్నాయి. నోటు సైజు మాత్రం అసలైన నోటు సైజే ఉంది. బ్యాంకు ఏటీఎంల నుంచి నకిలీ కరెన్సీ వస్తుండడంతో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.