: నా జన్మ తల్లిదండ్రులకే ఇష్టం లేదు!: రేణూ దేశాయ్


ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్న వేళ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, చిన్నతనంలో ఇంట్లో తాను ఎదుర్కొన్న విషయాలను గురించి నెమరు వేసుకుంది. తాను పుట్టడం తన తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదని పేర్కొంది. వారికి తొలుత అమ్మాయి పుట్టిందని, ఆపై మగ పిల్లాడు పుడతాడని వారు ఆశించగా, తాను పుట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారని వాపోయింది.

రెండో బిడ్డ కూడా ఆడపిల్లేనని తెలుసుకుని, మూడు రోజుల పాటు తన తండ్రి అసలు తనను చూసేందుకు కూడా రాలేదని చెప్పుకొచ్చింది. తమ్ముడిని ఎంతో ప్రేమతో చూసే వారని, తనను, తన అక్కను ఎంతో వివక్షతో పెంచారని, ఇదేమని అడిగితే కొట్టారని అందుకే, టీనేజ్ వచ్చేవరకు తాను టామ్ బాయ్ లా మారానని అంది. ఇప్పుడు ఇలా ఉండటానికి తన పట్టుదల, కృషే కారణమని అంది.

  • Loading...

More Telugu News