: బాలయ్యను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపిన రాజమౌళి


తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం తరువాత నేడు, బాలకృష్ణ 101వ చిత్రం కూకట్ పల్లి తులసివనం దేవస్థానంలో ప్రారంభం కాగా, పలువురు సినీ దిగ్గజాలు ఆయనకు శుభాభినందనలు తెలిపారు. రాజమౌళి ప్రత్యేకంగా దేవస్థానానికి వచ్చి బాలయ్యను కౌగిలించుకుని మరీ అభినందించారు. ఈ చిత్రం శాతకర్ణి కన్నా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, క్రిష్ లతో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరికాసేపట్లో చిత్రం ముహూర్తపు షాట్ ను తీయనున్నారు.

  • Loading...

More Telugu News