: వర్మ 'సన్నీలియాన్ - మహిళలు' ట్వీట్ పై పోలీసుల కేసు నమోదు


నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా సన్నీలియాన్ తో మహిళలను పోల్చుతూ, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పెను దుమారం రేపగా, గోవాలోని పనాజి పోలీసు స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఆయన చీప్ పబ్లిసిటీ కోసం అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని, మహిళలను కించపరిచాడని సామాజిక ఉద్యమ కార్యకర్త విశాఖ మాంబ్రె, పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ట్విట్టర్ లో వర్మ నిర్వహిస్తున్న అన్ని ఖాతాలనూ మూసి వేయాలని ఈ సందర్భంగా ఆమె పోలీసులను కోరారు. కాగా, గతంలోనూ ఆయన పెట్టిన ట్వీట్లపై పలు కేసులు విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News