: ప్రతిభ చూపిన ఎమ్మెల్యేకు బహుమతులు.. రోజుకు ఆరు.. చంద్రబాబు ఆలోచన


ఉభయ సభల్లో మంచి ప్రసంగం, ఉత్తమ జోక్యం, ప్రతిపక్షంపై సమయానుకూలంగా సద్విమర్శ, విమర్శలను సమర్థంగా తిప్పికొట్టగలిగే నేర్పు, మీడియా ముందు బాగా మాట్లాడడం వంటి అంశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు బహమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. సభ్యుల పనితీరును మదింపు చేసేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజువారీ కార్యక్రమాలను విశ్లేషించడం ద్వారా ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శాసన సభ్యులకు బహుమతులు అందజేస్తారు. ఇలా చేయడం వల్ల ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడుతుందని, చర్చల్లో నాణ్యత ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. సభ జరిగినన్ని రోజులు రోజుకు ఆరు బహుమతులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇటువంటి కార్యక్రమం తొలిసారని చెబుతున్నారు. మరి ఈ అవకాశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతవరకు ఉపయోగించుకుంటారో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News