: ‘నారీ శక్తి’ పురస్కారం అందుకున్న అమల .. ‘గర్వ పడుతున్నా’ అన్న నాగార్జున!
ప్రముఖ నటి, జంతు సంక్షేమ కార్యకర్త అయిన అమల అక్కినేని 'నారీ శక్తి పురస్కారం - 2016'ను రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ విషయాన్ని అమల భర్త నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం పంపిన లేఖను, అమల ఫొటోను నాగార్జున పోస్ట్ చేశారు.
‘డియర్ అమల .. నేను చాలా గర్వపడుతున్నాను. సమాజానికి ఆమె చేసిన స్వార్థ రహిత సేవలకు గాను ఈ రోజు ఉదయం నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అమల స్వీకరించింది’ అని ఆ ట్వీట్ లో నాగార్జున పేర్కొన్నారు. మరోపక్క, కుమారుడు అఖిల్ అక్కినేని కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.