: నా పెళ్లి రిసెప్షన్ కు అందరూ ఇన్వైటెడ్ .. ఓకే!: మీడియాతో హీరోయిన్ సమంత
హైదరాబాద్ బిర్యానీ నుంచి తన పెళ్లి రిసెప్షన్ వరకు పలు ప్రశ్నలు అడిగిన మీడియాకు ప్రముఖ నటి సమంత నవ్వుతూ సమాధాన మిచ్చింది. హైదరాబాద్ లో తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన సమంతను మీడియా చుట్టుముట్టింది. ‘హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పండి..’ అనే ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ.. ‘ కొత్తగా ఏం చెప్పాలి. మటన్ కీమా బాగుంటుంది’ అని చెప్పింది.
తెలుగులో కొత్త చిత్రాలకు తాను ఇంకా ఒప్పుకోలేదని, త్వరలోనే చేస్తానని, తమిళ్ లో మాత్రం మూడు చిత్రాల్లో నటిస్తున్నానని, ఈ చిత్రాల రిలీజ్ కోసం చూస్తున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. చైతన్యతో తన పెళ్లి గురించి ప్రశ్నించగా..‘ఆ..పెళ్లి గురించా.. నా పెళ్లి రిసెప్షన్ ఇక్కడే జరుగుతుంది..అందరూ ఇన్ వైటెడ్..ఓకే’ అని చిరునవ్వులు చిందిస్తూ సమంత సమాధానమిచ్చింది.