: ఒకవేళ నేను మగాడిని అయితే, ఆ పని మాత్రం చేయను: బాలీవుడ్ నటి సుస్మితా సేన్
‘ఒకవేళ మీరు మగాడు అయితే.. మహిళా సాధికారత కోసం ఎలాంటి పనులు చేస్తారు?’ అంటూ మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ ను ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని ప్రశ్నించాడు. ఇందుకు, సుస్మిత సమాధానం చెబుతూ .. ఒకవేళ తాను మగాడిగా కనుక పుట్టినట్టయితే కచ్చితంగా, మహిళా సాధికారత కోసం ఎటువంటి పోరాటాలు చేయనని, మహిళలు, పురుషులు సమానమేనని తాను గుర్తుంచుకుంటానని చెప్పింది. పురుషులతో సమాన అవకాశాలు మహిళలకు ఉండాలని తాను భావిస్తానని తన ఫాలోవర్ అజయ్ కేఆర్ శుక్లా అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చింది.