: ఆ విషయమై నాకు సమాచారం లేదు .. పత్రికల్లో చదివానంతే!: బీజేపీ సీనియర్ నేత అద్వానీ
బాబ్రీ మసీదు కూల్చి వేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పై ఉన్న కుట్ర కేసును పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయ పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అద్వానీని ఈ విషయమై మీడియా ప్రశ్నించింది. ఈ అంశంపై తనకు ఎటువంటి సమాచారం లేదని, కేవలం, పత్రికల ద్వారానే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. కాగా, ఈ కుట్ర కేసులో అద్వానీతో పాటు ఉన్న ఇతర నేతలపై కేసులను కింది కోర్టు ఎత్తివేయడాన్ని సీబీఐ సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అద్వానీపై కేసు ఎత్తి వేయడం సబబు కాదని తెలిపింది. ఈ అంశంపై ఈ నెల 22న సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వనుంది.