: మహిళా శక్తిని కొనియాడిన అమితాబ్, షారుక్, అజయ్ దేవ్‌గణ్


బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ మహిళా దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలుపుతూ స్త్రీ శ‌క్తిని కొనియాడారు. మ‌హిళ లేకపోతే హీరో కూడా జీరోనే అని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. షారుక్ ఖాన్ స్పందిస్తూ... ‘నిన్ను ముందుండి నడిపించేది ఆమే’ అని అన్నారు. అజయ్‌ దేవ్‌గణ్ స్పందిస్తూ... ఈ ఒక్క రోజే కాకుండా ప్ర‌తి రోజునూ మహిళా దినోత్సవంలా జ‌రుపుకుందామ‌ని పేర్కొన్నాడు. వారితో పాటు ప‌లువురు బాలీవుడ్ న‌టులు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో మ‌హిళా దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు.


  • Loading...

More Telugu News