: ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్!


దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి నూతన చిత్రానికి దర్శకత్వం వహించడానికి శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు ప్రకాష్ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఓ ధీరుడు’, ‘సైజ్ జీరో’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేదు. ఈసారి ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కథను కమర్షియల్ పంథాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా శర్వానంద్ నటిస్తారని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News