: 'హెచ్‌–1బీ వీసా'ల ఆంక్షలపై అమెరికాతో చర్చిస్తున్నాం: రవిశంకర్‌ ప్రసాద్


అమెరికాలో ఉద్యోగాలు చేస్తోన్న భార‌తీయుల‌పై ప్ర‌భావం ప‌డేలా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌–1బీ వీసా ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధిస్తూ మ‌రో బాంబు వేయడంతో అక్క‌డి భార‌తీయ ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ స్పందించారు. భారత్‌ తన ఆందోళనను అమెరికా ప్రభుత్వ అత్యున్నత వర్గాల దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు. మ‌న దేశ‌ ఐటీ నిపుణులు అమెరికా కంపెనీలకు విలువను జోడిస్తున్నారని ఆయ‌న అన్నారు. మ‌న ఐటీ కంపెనీలు ఫార్చ్యూన్‌–500 జాబితాలోని 75 శాతం కంపెనీలకు సేవలందిస్తున్నాయని ఆయ‌న తెలిపారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాయని పేర్కొన్నారు. అంతేగాక‌, భారత ఐటీ నిపుణులు, కంపెనీలు మ‌న‌దేశంలోనూ అమెరికా కంపెనీలకు అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News