: భవనం పైనుంచి తాడు సాయంతో పారిపోయిన బాలికలు!


ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా ప్రాంతంలోని ఇంగ్లిష్‌ బజార్‌లో ఉన్న‌ ప్రభుత్వ మహిళా శరణార్దుల గృహంలోంచి ప‌లువురు బాలిక‌లు త‌ప్పించుకొని పారిపోవ‌డం అల‌జ‌డి రేపుతోంది. ఈ ఘ‌ట‌న‌పై ఓ అధికారి మాట్లాడుతూ.. శ‌ర‌ణార్దుల గృహంలోంచి ఒక బంగ్లాదేశ్ బాలిక‌ స‌హా మొత్తం ఐదుగురు మైనర్లు తప్పించుకున్నార‌ని, వారంతా రెండు అంతస్తుల భవనంపై నుంచి ఓ తాడును కింద‌కు వ‌దిలి దాని సాయంతోనే పారిపోయారని చెప్పారు.

ఈ గృహంలో అక్రమ రవాణా నుంచి అధికారులు కాపాడిన 77మంది బాలికలు ఉంటున్నారు. ఈ శరణార్థుల గృహంలో ఉమెన్‌ ట్రాఫికింగ్‌కు గురైనవారు, పేద బాలికలు, మహిళల‌కు ప్ర‌భుత్వం పునరావాసం కల్పిస్తోంది. త‌ప్పించుకున్న బాలిక‌లు త‌మ త‌మ‌ ప్రాంతాలకు వెళ్లి ఉంటార‌ని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News