: మహిళా దినోత్సవం సందర్భంగా మోదీకి కేజ్రీవాల్ విన్నపం!


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ విన్నపం చేశారు. మహిళలను వేధించేవారిని, బెదిరించేవారిని తమరి ట్విట్టర్ అకౌంట్ నుంచి అన్ ఫాలో చేయాలని కోరారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారిని ట్విట్టర్ లో అన్ ఫాలో చేయడమే కాకుండా, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఢిల్లీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ కు రేప్ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, బీజేపీని ఇరకాటంలో పెట్టేలా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్య చేశారు.

అయితే, కేజ్రీవాల్ కామెంట్ ను ఆయన ప్రత్యర్థులు తప్పుబడుతున్నారు. గృహ హింస కేసును ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని ట్విట్టర్ లో కేజ్రీవాల్ ఫాలో అవుతుండటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ముందు సోమ్ నాథ్ భారతిని అన్ ఫాలో చేయాలని... ఆ తర్వాత ఇతరులకు హితబోధ చేయాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News