: ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించిన జగన్
అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణ రావు ఇంకా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోని పలువురు నేతలతో కలిసి ఆ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయన వెంట భూమన కరుణాకర్ రెడ్డి, బాలశౌరితో పాటు పలువురు ఉన్నారు. దాసరి ఆరోగ‍్య పరిస్థితిని గురించి జగన్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాసరి త‍్వరలోనే కోలుకోవాలని జగన్ అన్నారు.